నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా..

వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంతోమందిని క్రిమినల్స్ గా మార్చి జైలు పాలు చేస్తున్నాయి. ఒకప్పుడు వివాహేతర సంబంధాలతో భర్తలు భార్యలను హత మారిస్తే, ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయి భార్యలు భర్తలను హత మారుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సభ్య సమాజం షాక్ కు గురయ్యేలా జరుగుతున్న హత్యలు ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తున్నాయి.

భర్తను హతమార్చిన భార్య

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల మోజులో భర్తను హతమార్చే ఘటనలు పెరిగాయి. తాజాగా నంద్యాల జిల్లాలో అలాంటి దారుణ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. బనగానపల్లె మండలం కైప సమీపంలో మార్చి 16న పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో డోన్‌కు చెందిన పాలిష్ కట్టర్ విల్సన్‌గా నిర్ధారణ చేశారు. విల్సన్ హత్యకు గురైనట్లు తేలడంతో, దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

killer wife with illegal affair wife killed her husband in nandyala district with a shocking plan

భార్యా భర్తల మధ్య గొడవలు

డోన్‌లోని బంగారయ్య కాలనీకి చెందిన పాలిష్ కట్టర్ విల్సన్, 11 సంవత్సరాల క్రితం నంద్యాలకు చెందిన మేరీ అలియాస్ రాశితో వివాహం చేసుకున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. విల్సన్ మద్యానికి బానిసై మేరీని తరచుగా కొట్టేవాడు. ఈ నేపథ్యంలో మేరీకి బాపూజీ నగర్‌కు చెందిన మధు అలియాస్ శంకర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త హత్యకు స్కెచ్

విల్సన్‌ను హత్య చేసి పెళ్లి చేసుకోవాలని మేరీ, మధు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మధు తన స్నేహితులు రఫీ, అశోక్‌లను కూడా ఈ హత్యకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. విల్సన్ 15 రోజుల క్రితం డోన్‌కు వెళ్ళగా, మార్చి 15న మేరీ, మధు, రఫీ, అశోక్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. డోన్‌లో విల్సన్‌ కు మద్యం తాగించి, ఆటోలో ఎక్కించుకొని, రాయపాడుకు తీసుకెళ్లి చంపి కుందూ నదిలో పడేయాలని మొదట ప్లాన్ చేశారు.

కుందూ నదిలో పడేసే ప్లాన్.. కానీ జరిగిందిదే

అయితే ప్లాన్ ప్రకారం అలానే చేసిన వాళ్ళు మార్గమధ్యలో మద్యం మత్తు వీడిన విల్సన్ వాళ్లతో గొడవపడ్డాడు. తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అంటూ గొడవ చేసాడు. దీంతో కైప శివారుకు రాగానే వారంతా బెల్టుతో మెడకు బిగించి, రాళ్లతో తలపై కొట్టి విల్సన్‌ను అక్కడికక్కడే చంపారు. హత్య తర్వాత మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చివేయాలని ప్రయత్నించి, రక్తపు మరకలున్న బట్టలను కుందూ నదిలో పారేసి పారిపోయారు.

అనాధలైన ఇద్దరు పిల్లలు

పోలీసులు మృతదేహాన్ని గుర్తించడంతో నిందితులు భయపడి కైప వీఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు. ఈ కేసులో విల్సన్ భార్య మేరీతో పాటు మధు, రఫీ, అశోక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన మేరీని కఠినంగా శిక్షించాలని విల్సన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, తల్లి జైలుకు వెళ్లడం, తండ్రి హత్యకు గురికావడంతో విల్సన్, మేరీల ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. వివాహేతర సంబంధంతో తల్లి నేరం చేస్తే ఆ శాపం వారి ఇద్దరు పిల్లలకు చుట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+