వైఎస్ హయాంలోది బయటపడుతుందనే..: జగన్‌కు కమిడి కళా వెంకటరావు బహిరంగ లేఖ

హైదరాబాద్: గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇసుక మాఫియా దందాలు తాజా శ్వేతపత్రంతో మరోసారి బట్టబయలు అవుతుందనే భయంతోనే అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ఇసుక మాఫియా పదేళ్లపాటు పెంచి పోషించిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తమ పార్టీని విమర్శించే హక్కు లేదని కళావెంకటరావు అన్నారు. ఈ మేరకు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇసుక విధానాన్ని సమీక్షించి, శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు వెల్లడిస్తే దానిని తప్పుపట్టడం, ప్రత్యారోపణలు చేయడం సరికాదని అన్నారు.

Kimidi Kala Venkat Rao

ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇసుక అక్రమ రవాణా నియంత్రించడం ద్వారా అటు వినియోగదారులకు, ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుందని, తద్వారా ఒక త్రైమాసికం ఉండగానే ప్రభుత్వానికి ఇసుక విధానం వల్ల 517.36 కోట్ల రూపాయిలు ఆదాయం వచ్చిందని చెప్పారు.

23 జిల్లాలు కలిపి ఏడాది కాలంలో గత ప్రభుత్వ హయాంలో ఆదాయం 100 కోట్లు మాత్రమేనని గుర్తించాలని అన్నారు. సీనరేజి కింద 2007-08లో 87.70 కోట్లు, 2008-09లో 66.90 కోట్లు, 2009-10లో 90 కోట్లు, 2010-11లో 128 కోట్లు, 2012-13లో 121.60 కోట్లు, 2013-14లో 4.90 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని చెప్పారు. 2007 నుండి 2014 వరకూ వచ్చిన మొత్తం ఇసుక ఆదాయం 600 కోట్లు కూడా లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+