వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బజారుకీడిస్తే సహించం: శివప్రసాద్ వ్యాఖ్యలపై కిమిడి హెచ్చరికలు

పార్టీ ఎంపి శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. పార్టీ బజారుకీడిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వేదికపై చర్చించి, పార్టీని రచ్చకెక్కించే వైఖరి తప్పు అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొద్ది రోజులుగా చిత్తూరు ఎంపి శివప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పరోక్షంగా స్పందించారు. పార్టీ పరువును బజారుకీడ్చిన వ్యక్తులు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించా రు. గతంలో కూడా కీలక నేతలను కూడా వదులుకున్న చరిత్ర టిడిపికి ఉందని గుర్తు చేశారు.

Kimidi Kala Venkat Rao reacts on Shiva Prasad's comments

ఈ విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరితో ఉన్నారని, రాజకీయ పార్టీలకు సంస్థాగత నిర్మాణం కీలకమని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు టిడిపి ప్రతి రెండేళ్లకు ఓసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తోందని ఆయన చెప్పారు.

బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ఈఏడాది మహానాడు తెలంగాణ, ఎపిలో ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.

విశాఖలో విద్యుత్ మంత్రుల సమావేశం

ఈ నెల 27,28 తేదీల్లో జాతీయస్థాయి విద్యుత్ మంత్రుల సమావేశం విశాఖ వేదికగా నిర్వహించనున్నట్టు మంత్రి కళా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇంధన వనరుల అవసరం, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకునే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

English summary
Reacting on party Shiva Prasad's comments, Telugu Desam Party (TDP) Andhra Pradesh chief and minister, warned party men against the indiscipline
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X