వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో గందరగోళమే: ముభావంగా కిరణ్, దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran comes to Assembly
హైదరాబాద్: శాసన సభ మంగళవారం కూడా తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన కాసేపటికే సభాపతి నాదెండ్ల మనోహర్ సభను బిఏసి సమావేశం వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస శాసన సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

నినాదాలు చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో బిఏసి సమావేశం వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు. శాసన మండలి బిఎసి అనంతరం అసెంబ్లీ బిఏసి జరగనుంది.

సభ వాయిదా పడటం కంటే ముందు స్పీకర్ ఆయా పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. తెలుగు దేశం పార్టీ సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ, తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించాలని సిపిఐ, సమైక్య తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్మానాలను ఇచ్చాయి.

కిరణ్, దామోదర ఎడమొహం, పెడమొహం

సోమవారం అసెంబ్లీకి గైర్హాజరైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం వచ్చారు. అస్వస్థత కారణంగా ఆయన నిన్న సభకు రాలేదు. ఈ రోజు సభకు వచ్చారు. సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ముభావంగా కనిపించారు. కిరణ్ పైన దామోదర సోమవారం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా దామోదర.. కిరణ్ పైన తెలంగాణ బిల్లు విషయంలో మండిపడుతున్నారు. సభకు వచ్చిన కిరణ్.. దామోదరను పలకరించారు. అయితే ఇద్దరు ముభావంగా కనిపించారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy came to Assembly on Tuesday. He was absent on Monday, when Telangana Bill produced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X