కొత్త పార్టీ అవసరం, చిరు పెట్టినప్పుడూ: సబ్బం, హర్ష

Kiran gets backing to launch new party
హైదరాబాద్: సీమాంధ్రలో కొత్త పార్టీ ఆవశ్యకతను తాము కిరణ్ కుమార్ రెడ్డికి వివరించామని ఎంపీలు సబ్బం హరి, హర్ష కుమార్‌లు ఆదివారం అన్నారు. మాదాపూర్‌లో కిరణ్ రెడ్డితో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కొత్త పార్టీ ఆవశ్యకత పైన భేటీలో చర్చించామన్నారు. కొత్త పార్టీ అవసరముందని తాము చెప్పామని, రెండ్రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. సమైక్యం కోసం చేసిన పోరాటం వృథా కావొద్దని తాము చెప్పామన్నారు.

సీమాంధ్ర ప్రజలు కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త పార్టీ ఏర్పడనుందన్నారు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కిరణ్ మాట్లాడుతారన్నారు. కిరణ్ వెంట ముఖ్యమైన నేతలు, మంత్రులు లేరు కదా అని ప్రశ్నిస్తే... ఎన్టీఆర్, చిరంజీవిలు పార్టీ పెట్టినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట లేరన్నారు.

పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నార, ఎప్పుడు, ఎలా, అజెండా ఏమిటో చెబుతామన్నారు. ప్రస్తుతం ఎంపీలతో కిరణ్ భేటీ అయ్యారని, రేపు లేదా ఎల్లుండి మరికొందరు నేతలతో భేటీ అవుతారన్నారు. కిరణ్ పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీకి చాటి చెప్పేందుకు కొత్త పార్టీ అవసరమన్నారు.

కాగా, కిరణ్‌తో జరిగిన భేటీలో హర్ష కుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివ రావు, శైలజానాథ్ తదితరులు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+