వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ గేమ్ మాత్రమే: సిఎం కిరణ్ రెడ్డి పార్టీ ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త పార్టీ స్థాపన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెడతానని గానీ పెట్టబోనని గానీ చెప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సహకరిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని స్థాపించడం లేదని గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. అయితే, పార్టీ పెట్టాలనే ఒత్తిడి సీమాంధ్ర ప్రజల నుంచి వస్తోందని చెబుతున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ అదే మాట అన్నారు.

త్వరలో కొత్త పార్టీ రావచ్చునని, అయితే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని స్థాపిస్తారని తాను అనుకోవడం లేదని, కొత్త పార్టీలో ఎన్జీవో సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు.

Kiran Kumar Reddy

ముఖ్యమంత్రి పార్టీ పెడతారో, లేదో తాను చెప్పలేనని, అయితే పుకార్లు మాత్రం ఉన్నాయని శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజలు కొత్త పార్టీ కోసం వేచి చూస్తున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారని తొలుత ప్రకటించింది రౌతు సూర్యప్రకాశ్ రావే.

కొత్త పార్టీ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారనే విషయాన్ని వెల్లడించడం లేదని, ఆయన కాంగ్రెసు పార్టీలోనే ఉంటారని భావిస్తున్నానని ఆయనకు అత్యంత సన్నిహితులైన మంత్రి ఒకరు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

సీమాంధ్రలో పెద్ద యెత్తున వెలసిన హోర్డింగుల మిస్టరీ, టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న సమైక్యాంధ్ర వాణిజ్య ప్రకటనలు మాత్రం కొత్త పార్టీపై ఊహాగానాలను పెంచుతూనే ఉన్నాయి. కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం సజీవంగా ఉండేలా మాత్రం చూస్తున్నారు.

కాగా, చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి మద్దతుగా నోరు విప్పారు. సోనియాను ఇటాలియన్ మహిళగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యను ఆయన తిప్పికొట్టారు. అదే సమయంలో ఆ వ్యాఖ్యపై కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంత్రి శైలజనాథ్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. సోనియాపై విమర్శలు చేసే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు.

ఇదంతా చూస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకునే వ్యూహంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారం సజీవంగా ఉండేలా చూస్తున్నారని అంటున్నారు. అయితే, ఆయన పార్టీని ఏర్పాటు చేయకపోవచ్చుననే మాట గట్టిగానే వినిపిస్తోంది.

English summary

 Chief Minister Kiran Kumar Reddy’s camp appears to be playing mind games when it comes to the new political party. Over the last two days, members of the Chief Minister’s core group have told the media that Kiran Kumar Reddy was not thinking of launching a party, but there was pressure from people of Seemandhra to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X