కంట్రోల్లో ఉండు: హరీష్ రావుకు కిరణ్ రెడ్డి హెచ్చరిక

హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.
బుధవారం తెరాస సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న కిరణ్ స్పీచ్‌పై కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే... కెసిఆర్ ఈ సభలో చాలా చిన్నవాడని, కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలన్నారు. అదే పనిగా తెరాస సభ్యులు కిరణ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో మీకు డిస్టర్బ్ చేయాలనిపిస్తే మీ ఇష్టం అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. బిల్లు పైన ప్రసంగించేందుకు ఆయన 450 పేజీలు సిద్ధం చేసుకున్నారు. ఎనిమది నుండి పది గంటల పాటు ప్రసంగించే అవకాశముంది.












Click it and Unblock the Notifications