మాకూ టైమివ్వండి: టిపై ప్రణబ్‌కు కిరణ్ లేఖ, ఢిల్లీతో ఢీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విభజన అంశంపై మంగళవారం లేఖ రాశారు. విభజనపై అసెంబ్లీ అభిప్రాయం కోసం గతంలో పలు రాష్ట్రాలకు 45 రోజుల సమయం ఇచ్చారని, ఇప్పుడు కూడా అలాగే గడువు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్‌కు సమయం ఇవ్వాలన్నారు.

రాష్ట్రపతికి సమయం ఇవ్వాలని లేఖ రాయడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి అధిష్టానానికి తన సమైక్యవాదనను బలంగా వినిపించినట్లయిందని అంటున్నారు. విభజనపై కాంగ్రెసు వేగంగా అడుగులు ముందుకు వేస్తుండగా కిరణ్ మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని చెబుతున్న కిరణ్ సమైక్యం కోసం అవసరమైతే కేంద్రాన్ని ఎదిరిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా మరోసారి అధిష్టానానికి కిరణ్ సవాల్ విసిరారంటున్నారు.

Kiran Kumar Reddy

రాయల తెలంగాణపై శంకర రావు

రాయల తెలంగాణపై మాజీ మంత్రి, కంటోన్మెంట్ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు శంకర రావు వేరుగా స్పందించారు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నష్టం తప్పదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పార్టీకి లాభం చేకూరినా పది జిల్లాల్లో మాత్రం లాభం ఉండదన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ అంగీకరించారన్నారు.

కుట్ర చేస్తుంటే జైత్రయాత్రలా: శ్రవణ్

కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ పేరుతో ఢిల్లీలో కుట్రలు చేస్తుంటే మరోపక్క తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాష్ట్రంలో జైత్రయాత్రలు చేస్తున్నారని తెరాస నేత శ్రవణ్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+