కాంగ్రెసులోకి వెళ్లను: కిరణ్ రెడ్డి, జగన్ -బాబులపై ఫైర్
అనంతపురం: తాను తిరిగి కాంగ్రెసులోకి వెళ్లే ప్రసక్తి లేదని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తాను బయటకు వచ్చానని ఆయన అన్నారు. సమైక్యంగా వున్న ఆంధ్రప్రదేశ్ విడిపోవ డానికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డిలు విభజనకు అనుకూలమ, మడమతిప్పారని ఆయన విమర్శించారు. బుధవారం మధ్యాహ్నం అనంతపురము జిల్లా పుట్టపర్తిలో జరిగిన రోడ్‌షోలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.
తాను ముఖ్యమంత్రి పదవిని సైతం వదలిపెట్టి రాష్ట్ర సమైక్యతకోసం పాటుపడుటుంటే సమైక్య ముసుగులో వున్న తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పాకులా డుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖలు ఇచ్చారని, వైయస్సార్ కాంగ్రెసు అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆర్టీకల్ 3 ప్రకారం విభజించమని ఒకసారి, సమ న్యాయం, సమైక్యం అంటూ రాష్ట్ర విభజనకు కారకులు అయ్యారని ఆయన అన్నారు..

పదవీ ఆరాటం వుంటే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవాడని కాంగ్రెస్ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు రాష్ట్ర విభజన చేయకండి అంటూ పలుమర్లు కోరానని అవసరమైతే నాలుగు పర్యాయాల పాటు ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికే ఇవ్వండి అని తెలిపానన్నారు. 23 జిల్లాలకు చెందిన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని 23 నిమిషాలలో పార్లమెంట్ నిలువునా కాల్చివేసిందని కేంద్రం తమ స్వార్థం కోసం తెలుగు ప్రజలతో ఆటలు ఆడుకుందన్నారు. వి
భజన సీమాంధ్ర, తెలంగాణ ప్రజల సమ్మతం మేరకే జరగాలని, 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు చెందినదిగా ప్రకటించడం సరైంది కాదన్నారు. శాసనసభలో విభజన బిల్లును తిరస్కరిస్తే పార్లమెంట్‌లో బిల్లును ఎలా ఆమోదింపచేస్తారని ప్రసార మాధ్యమాలను నిలిపివేసి తెలుగుజాతి మాటకు విలువలేకుండా చేశారన్నారు.
నలబై రోజుల పాటు శాసనసభలో చర్చ జరిగితే రాష్ట్ర విభజన వద్దని చంద్రబాబునాయుడు ఒక గంట కూడా ప్రసంగించలేదని తాను నాలుగు గంటల పాటు రాష్ట్ర సమైక్యతకై మాట్లాడానన్నారు. తెలుగుజాతి కలిసి వుండాలనే ధ్యేయంతో జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించానని పోరాటంలో తెలుగు జాతి ఏ విధంగా కలిసి వుండదో చూస్తానని, అధికారం వ్యాపారం కోసం వచ్చే నేతలను తరలికొట్టి తెలుగుజాతి అభివృద్ధి చేసేవారని చట్టసభలకు పంపాల న్నారు.












Click it and Unblock the Notifications