Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రస్తుత బిల్లును ఆమోదిస్తేనే: సన్యాసంపై సిఎం ట్విస్ట్

హైదరాబాద్: శాసనసభ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) యథాతథంగా పార్లమెంటులో ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును శాసనసభ, శాసన మండలి రెండూ బిల్లును తిరస్కరించాయని, దీన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు పార్టీ అధిష్టానంపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే కొత్త పార్టీ పెడతానని కాదని ఆయన అన్నారు. కొత్త పార్టీ పెట్టడమనేది తనకు ప్రధానాంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిల్లును తిరస్కరించామని ఆయన అన్నారు. రాజకీయ జీవితం కన్నా రాష్ట్ర సమైక్యతే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు.

Kiran Reddy

బిల్లును శానససభ, మండలి తిరస్కరించిన తర్వాత ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తును ఢిల్లీ నిర్ణయించకూడదని ఆయన అన్నారు. విభజన రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధం పెట్టకూడదని ఆయన అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెద్ద తిప్పదమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. అధిష్టానం తప్పు చేయడం వల్లనే తాను ప్రజల తరఫున పోరాడుతున్నానని ఆయన అన్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పట్టించుకోనని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ప్రధానమని ఆయన అన్నారు. తెలంగాణ కావాలో, వద్దో ప్రజలు వచ్చే లోకసభ ఎన్నికల్లో తేలుస్తారని ఆయన అన్నారు. విభజన జరిగితే విద్య, నీరు వంటి వివిధ రంగాల్లో సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద సమస్య అని ఆయన అన్నారు.

భవిష్యత్తు కార్యాచరణ కోసం తాము సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. బిల్లును ప్రభుత్వానికి పంపవద్దని రాష్ట్రపతిని శాసనసభ కోరుతుందని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలకు దూరమైందని, తాను ప్రజల తరఫున నిలబడ్డానని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+