ఎమ్మెల్యేల చెవిలో పువ్వులు, అందంగా ఉన్నారని కిరణ్

అభివృద్ధిలో తెలంగాణను విస్మరించలేదని కిరణ్ చెప్పగా తెరాస సభ్యులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. కిరణ్ వ్యాఖ్యలు చెవిలో పువ్వులు పెట్టినట్లుగా ఉన్నాయని అన్నారు. దానికి కిరణ్ ధీటుగా సమాధానమిచ్చారు. చెవిలో పువ్వులతో చాలా అందంగా ఉన్నారని, ఇప్పటి వరకు మీరు వాటిని ప్రజలకు పెట్టారని కౌంటర్ ఇచ్చారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బుధవారం దాదాపు మూడు గంటలు మాట్లాడిన కిరణ్ బుధవారం మధ్యాహ్నం కొనసాగించారు.
ఆయన ప్రసంగంపై తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు పలుమార్లు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దానికి కిరణ్ కూడా ధీటుగానే స్పందించారు. నిన్న కెటిఆర్‌ను, ఈ రోజు హరీష్ రావును హెచ్చరించారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభాపతి నాదెండ్ల మనోహర్ పది నిమిషాలు వాయిదా వేశారు.
బిఎసి సమావేశం
అనంతరం బిఏసి సమావేశమైంది. రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన గడువు పెంచిన నేపథ్యంలో బిఏసి సమావేశమైంది. ఐదున్నరకు బిఏసి సమావేశం ముగిసింది. ఆ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications