రాజీనామా: కిరణ్‌తో 8మంది మంత్రులు, పార్టీపై దాటవేత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. దానిని గవర్నర్ ఆమోదించారు. కిరణ్ ఆంధ్రప్రదేశ్‌కు 16వ ముఖ్యమంత్రి. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కిరణ్ వెంట 8 మంది మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కేబినెట్ రద్దు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కేబినెట్ రద్దయింది. గవర్నర్ కోరినా తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనని కిరణ్ చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముంది. కిరణ్ రాజీనామాకు మద్దతుగా ఎపిఎన్జీవోలు తరలి వచ్చారు.

కిరణ్ వెంట వీరే
కిరణ్ రాజీనామా సమయంలో ఆయన వెంట మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, మహీధర్ రెడ్డి, టిజి వెంకటేష్, పార్థసారథి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులు ఉన్నారు. వారితో పాటు పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
పార్టీపై దాటవేత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై దాటవేత ధోరణి అవలంభించారు. విలేకరుల సమావేశం సమయంలో కొత్త పార్టీ పెడతారా అని ప్రశ్నిస్తే.. తనకు తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని తెలుగు ప్రజల క్షేమం ముఖ్యమన్నారు. రాజకీయ భవిష్యత్తే కావాలనుకుంటే తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగే వాడినని చెప్పారు. కొత్త పార్టీ పైన మాత్రం స్పందించలేదు.
కొత్త పార్టీ ఉంటుందా?
ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా రెండు మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. నిన్న లోకసభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. కిరణ్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారితో కలిపి త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications