శాడిస్ట్‌తో వేధింపు: రోజా, జగన్ అడిగిందొకటి...: హోదాపై జూపూడి సంచలనం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్‌గా ఓ శాడిస్టును పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజు ఆదివారం నాడు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్‌ను మార్చాలని తాము ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకే వైసిపి నేతల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఓ శాడిస్ట్ మున్సిపల్ కమిషనర్‌ను పెట్టి టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. గతంలో కూడా కమిషనర్ వేధింపులపై అధికారులు తనకు ఫిర్యాదు చేశారన్నారు.
ఆయన పరిధిలోని ఏఈ, డీఈలను ఆయన సస్పెండ్ చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆ కమిషనర్ గత రికార్డులను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కుమారి భర్త కేజే కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతోనే కెజె కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేసి, కెజె కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆయనను పూత్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. గాలి ముద్దుకృష్ణమ ప్రోత్సాహంతోనే పోలీసులు తమ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారని శాంత కుమారి ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా అడిగినట్లు చెబుతారా?: జూపూడి
వైసిపి పైన టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసిపి రాసినలేఖలో కోరిందొకటి, ప్రజలకు చెప్పిందొకటని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి లేఖలో అడిగి.. ప్రత్యేక హోదా అడిగినట్లు చెబుతున్నారన్నారు. జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. హోదాను టిడిపి సాధించి తీరుతుందన్నారు.












Click it and Unblock the Notifications