గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచంలోనే తొలిసారి: అమరావతిలో మెగా ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నాలెడ్జ్‌ ఎకానమీ జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధానిలో సీఐఐ భాగస్వామ్యంతో దీనిని నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూన్‌ నెలలో పనులు ప్రారంభించి 2017 నాటికి మొదటి దశ పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో 10 ఎకరాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు 2019 నాటికి వంద ఎకరాలకు విస్తరిస్తేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికి గాను హార్వర్డ్‌, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సహకారం తీసుకుంటామని తెలిపారు.

knowledge-economic-zone-to-come-up-in-andhra-pradesh

కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ముఖ్యాంశాలు:

* రాష్ట్రంలో రూ.16,500 కోట్లతో 1,205 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
* అమరావతి-కర్నూలు, అమరావతి-అనంతపురం మధ్య వెయ్యి కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. వీటిపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధపెట్టాలని సూచించారు.
* 15 రోజుల్లో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.75 వేల కోట్ల పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
* రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భాగస్వామ్యంలో టవర్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా 49శాతం వాటా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు.
* ఫైబర్‌ గ్రిడ్‌ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ సౌకర్యం అందించాలని సూచించారు.
* దేశంలో ఇంటర్నెట్‌ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్‌ ఉంటే, అంతర్జాతీయ సగటు వేగం 10 ఎంబీపీఎస్‌ ఉంది. మన రాష్ట్రంలో అంతకుమించిన వేగంతో తక్కువ ధరకే అందరికీ ఈ మూడు ప్రజలకు అందించాలన్నారు.
* మార్చి నెలాఖరు కల్లా గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూసమీకరణ పూర్తి అవుతుంది. ఏప్రిల్‌లోభోగాపురం టెండర్లు పిలుద్దామన్నారు. మంత్రులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలన్నారు.
* అభివృద్ధి జరగకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రాజెక్టుల వల్ల లాభమే తప్ప నష్టం జరగదనే విషయాన్ని ప్రజలకు వివరించగలగాలన్నారు.
* ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి. విశాఖజిల్లా అచ్యుతాపురం సెజ్‌ విస్తరణకు భూములు సేకరించాలన్నారు.

ఈ సమావేశానికి ఏపీ సీఎస్‌ ఎస్‌పీ టక్కర్‌తో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, 13 జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

నెల్లూరును అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి: నారాయణ

నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపిస్తుందని మంత్రి నారాయణ బుధవారం చెప్పారు. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ మంత్రి నారాయణను ఈ రోజు కలిశారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధికి సహకరించాలని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్‌ను మంత్రి నారాయణ కోరారు.

English summary
A first-of-its-kind Knowledge Economic Zone (KEZ) will be set up in Andhra Pradesh's new capital region Amaravati, Chief Minister N Chandrababu Naidu said today. The move would give a push to knowledge-driven economic development of the state, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X