ఆ రెండు నియోజవకర్గాల్లో ఏదైనా సరే - కొడాలి నాని సవాల్..!!
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని కొడాని నాని జోస్యం చెప్పారు. రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని వ్యాఖ్యానించారు. టీడీపీ మేనిఫెస్టోపైన కీలక వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..లోకేష్ పైన మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేసారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు. ఎన్టీఆర్ పేరుతో, ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు, గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని విమర్శించారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

రాజకీయాలంటే బట్టల వ్యాపారమా, ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మండిపడ్డారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని, చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి మేనిఫెస్టోలో అదిరిపోయే సంక్షేమం ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించారు. దీని పైన వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. సంక్షేమం ఓట్ బ్యాంక్ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ..టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం తమను గెలిపిస్తుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటన ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications