దమ్ముంటే రా .. చంద్రబాబు కొడుకువే అయితే సీఎం ఇంటి గుమ్మం తాకు చూస్తా: లోకేష్ కు కొడాలి నాని సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగనన్న కాదు జగన్ దున్న అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ మంత్రి శంకర్ నారాయణ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక సీఎంని ఈవిధంగా మాట్లాడటం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. ఇక తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నారా లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ నిప్పులు చెరిగారు.

నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే

నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే

లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కొడాలి నాని లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను దున్న అంటూ లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడిన కొడాలి నాని ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా నా కొడకా ..ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు చూస్తా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు అంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. అంతేకాదు లోకేష్, చంద్రబాబుల తోలు ఒలిచి చెప్పులు కుట్టిస్తా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 లోకేష్ ఓ పంది పిల్ల, చంద్రబాబు గుంట నక్క

లోకేష్ ఓ పంది పిల్ల, చంద్రబాబు గుంట నక్క

లోకేష్ ఒక పిల్ల పంది అంటూ మండిపడిన కొడాలి నాని మంగళగిరిలో పోటీ చేసిన నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావ్ అంటూ ఎద్దేవా చేశారు . నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కాదు ముందు మేమే కుక్కను కొట్టినట్టు కొడతాము అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు అధికారంలోకి వస్తావా అంటూ లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఓ పెద్ద కుక్క, గుంటనక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలల వ్యవహారంపై టిడిపి విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎయిడెడ్ స్కూల్స్ జగన్ కు ఇస్తారా? ప్రభుత్వానికి ఇస్తారా?

ఎయిడెడ్ స్కూల్స్ జగన్ కు ఇస్తారా? ప్రభుత్వానికి ఇస్తారా?

ఎయిడెడ్ స్కూల్స్ ను జగన్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి కొడాలి నాని ఈ స్కూళ్ళు జగన్ కి ఇస్తారా ప్రభుత్వానికి ఇస్తారా చెప్పాలని ప్రశ్నించారు. పులివెందులలో ఉన్న సొంత స్కూల్ నే జగన్ ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు కావాలని ప్రతి విషయంలో బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నట్టు మండిపడ్డారు. అనంతపురం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలకు చెందిన విద్యార్థి విభాగాలు ప్రవేశించడంతోనే హింసాత్మక సంఘటన చోటుచేసుకుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Recommended Video

    RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Oneindia Telugu
    చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారిపోయారు

    చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారిపోయారు

    పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థులు గాయపడినట్లు చేశారని పేర్కొన్న కొడాలి నాని ఇదంతా టీడీపీ చేసిన కుట్రగానే అభివర్ణించారు. పాతిక వేల ఓటర్లు ఉన్న కుప్పంలో గెలవలేక చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారి పోయాడని నాని జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్ కు దమ్ముంటే రారా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు, నారా లోకేష్ లను మరోమారు తూర్పారబట్టారు మంత్రి కొడాలి నాని .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+