రోజాపై పంది వ్యాఖ్యలా ? చంద్రబాబు, లోకేష్ దరిద్రులు-మళ్లీ రెచ్చిపోయిన కొడాలి..

ఏపీలో బూతు వ్యాఖ్యలతో చంద్రబాబు, లోకేష్ పై పలుమార్లు విరుచుకుపడిన మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మంత్రి రోజాపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై మరోసారి రెచ్చిపోయారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్, తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతల్ని టార్గెట్ చేశారు. రోజాపై లోకేష్ రెచ్చిపోతుంటే.. జగన్ పై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. దీంతో వీరిద్దరి తీరుపై ఇవాళ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ఆరోపించారు.లోకేష్ యాత్రను జనం పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చెక్కిందన్నారు. నేను బూతులు మాట్లాడతా అనే వాళ్లకి చంద్రబాబు ,లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని కొడాలి ప్రశ్నించారు. సీఎం జగన్ సీమ బిడ్డ కాబట్టే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు..సీఎం అయ్యారని కొడాలి గుర్తుచేశారు. ఇవాళ లోకేష్ భాష ఎలా ఉందని అడిగారు. జగన్ ను నువ్వు రాయలసీమలోనే పుట్టావా అని అడుగుతున్నాడని, అదే మాట మేము అంటే గోల గోల చేస్తున్నారన్నారు.

kodali nani lashed out at nara lokesh for his pig comments on rk roja, slams chandrababu

జగన్ డిఎన్ ఏ రాయలసీమని, లోకేష్ డిఎన్ ఏ తెలంగాణని కొడాలి నాని వ్యాఖ్యానించారు. లోకేష్ తెలంగాణ లో పుట్టి ఇక్కడ ఎందుకు దరిద్రమన్నారు. లోకేష్ నిష్ఠ దరిద్రుడని, చంద్రబాబు పుట్టుకతో దరిద్రుడన్నారు.పందికి డ్రెస్ వేస్తే రోజా లా ఉంటుందా..ఇలా మాట్లాడతారా అని లోకేష్ వ్యాఖ్యలపై నాని ఫైర్ అయ్యారు.పది పందులు కలిస్తే లోకేష్ అన్నారు. నీ తల్లిని రోడ్ పైకి తెచ్చింది చంద్రబాబేనన్నారు. ఈ విషయం..లోకేష్ తెలుసుకోవాలన్నారు. లోకేష్.. నన్ను కానీ , వంశీని కానీ, ద్వారంపూడిని కానీ టచ్ చెయ్...ఏమి జరుగుతుందో చూడు అంటూ కొడాలి సవాల్ విసిరారు. భారతమ్మ పేరు ఎత్తితే, బొమ్మ కనపడితే చూస్తాం ఏం జరుగుతుందో అంటూ కొడాలి హెచ్చరికలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+