Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారు - బాలయ్య తో ఇలాగేనా , కొడాలి నాని ఫైర్..!!

మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేసారు. మేనిఫెస్టో హామీల అమ‌లుపై ద‌మ్ముంటే చర్చ‌కు రావాల‌ని సవాల్ చేసారు. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా అని ప్రశ్నించారు. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జూ ఎన్టీఆర్ మీటింగ్ కు రాలేదని తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ ఫొటో ఎందుకు పెట్టలేదని కొడాలి నాని నిలదీసారు.

ఒక్క హామీ అమలు కాలేదు:మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. దీని పైన మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ చంద్రబాబు అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ రూ 97 వేల కోట్లు ఖర్చు చేసారని వివరించారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేద‌ని కొడాలి నాని ప్రశ్నించారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నెర‌వేర్చార‌ని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారని గుర్తు చేసారు.

Kodali Nani made serious comments againt Chandra Babu on releasing manifesto in Mahanadu

పక్క రాష్ట్రాల నుంచి హీరోలను:ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మహానాడు పై ఎన్టీఆర్ పొటో పెట్టి రెండు వైపులా చంద్రబాబు, లోకేష్ ఫొటోలు ఎలా పెడతారని ప్రశ్నించారు. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీసారు.
లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ ఫొటో ఎందుకు పెట్టలేదుని ప్రశ్నించిన కొడాలి నాని.. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా అని నిలదీసారు. 2014 లో టీడీపీ ఇచ్చిన హామీలకు మోదీ, పవన్ మద్దతుగా నిలిచారని.. హామీలు అమలు చేయకపోతే వారిద్దరూ ప్రశ్నించలేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తారక్ ను తిట్టిస్తున్నారు:చంద్రబాబు ఏర్పాటు చేసిన మీటింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ రాలేదని తారక్ తో పాటుగా కుటుం సభ్యులను తిట్టిస్తున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. 2014లో పెన్షన్ పెంచుతానని చెప్పి 2019 వరకు పట్టించుకోలేదన్నారు. తమ్ముళ్ళు అదిరిందా అంటున్నారని.. వచ్చే ఏడాది బాగా అదిరిపోతుంది చంద్రబాబుకు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపారా అని ప్రశ్నించారు. బీసీలకు వెన్నుముకగా నిలిచింది ఎన్టీఆర్‌ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కేబినెట్‌లో 15 మంది ఓసీలు ఉంటే.. జగన్‌ కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+