జగన్ కు ఆ ఖర్మ పట్టలేదు.. ఎవరేం పీకలేరు.. మళ్ళీ మొదలెట్టిన కొడాలి నాని!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికల ఫలితాలు తర్వాత వైసిపి అధికారం కోల్పోగా టిడిపి కూటమి పాలనాపగ్గాలు చేపట్టింది. ఇక తాజాగా పార్టీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ఫలితాలపైన తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈవీఎంల విషయంలో అనుమానం వ్యక్తం చేసినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
శకుని పాచికలు వేసినట్టుగా ఫలితాలు
శకుని పాచికలు వేసినట్టుగా టిడిపి జనసేన బిజెపికి కావలసిన పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం అదేనని తేల్చి చెప్పారు. మంచి చేసిన కూడా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక ఈ సమయంలో కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని ఆ మేరకు ముందుకు వెళతామని కొడాలి నాని వెల్లడించారు.

చంద్రబాబు హామీల అమలెక్కడ
1.30 కోట్ల మంది ప్రజలు తమకు ఓటు వేశారని, వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉందని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని కొడాలి నాని అడిగారు.
రుషికొండ భవనాలలో జగన్ ఉంటాడా?
కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పాడని కొడాలి నాని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపణలు గుప్పించారు. రుషికొండ లో ఉన్న భవనాలను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ఉన్న భవనాలు జగన్ నివాసాలు అని చెబుతున్నారని ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్ కు లేదని కొడాలి నాని పేర్కొన్నారు.
ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు
కనీసం ఎటువంటి రివ్యూ చేయకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తీసేయడం దారుణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమను ఎవరు టార్గెట్ చేసిన భయపడేది లేదని, కొడాలి నాని పేర్కొన్నారు. ఎవరూ జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్ల కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో చెప్తే మొహాన పడేస్తాం అన్నారు. ప్రజలు టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications