Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టి: మహిళా రచయితల భేటీ, 'జాగృతి' అరెస్ట్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం సకల జన భేరీ జరగనున్న నిజాం కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ నెల 29వ తేదిన(శుక్రవారం) సకల జన భేరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. కోదండరామ్ టిజివో కార్యాలయంలో పలువురు విద్యార్థి నేతలతో భేటీ అయ్యారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని తెలంగాణ ఉద్యోగుల జెఏసి ఆధ్యక్షుడు దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సకల జన భేరీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సకల జన భేరీ సభకు ప్రతి కుటుంబం కదలి రావాలని పిలుపునిచ్చారు. నగర ఉద్యోగులు జిల్లాల నుంచి వచ్చే వరకు సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

బుధవారం ఎపిఎన్జీవో కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి ముట్టడించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు లమాఖాన్‌లో జరిగిన రాష్ట్ర విభజనపై చర్చ కార్యక్రమంలో మహిళా రచయితలు కరుణ, విమల, రత్నమాల, రజిత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కోదండరామ్

విద్యార్థులతో కోదండరామ్

ఈ నెల 29వ తేదిన సకల జన భేరీ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్

మాట్లాడుతున్న విద్యార్థి నాయకులు

మాట్లాడుతున్న విద్యార్థి నాయకులు

ఈ నెల 29వ తేదిన సకల జన భేరీ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులతో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ భేటీ అయ్యారు. మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నాయకుడు.

మాట్లాడుతున్న కోదండ

మాట్లాడుతున్న కోదండ

ఈ నెల 29వ తేదిన సకల జన భేరీ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులతో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ భేటీ అయ్యారు. కోదండ మాట్లాడుతున్న దృశ్యం.

మహిళా రచయితలు

మహిళా రచయితలు

మహిళా రచయితల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లామాఖాన్‌లో జరిగిన విభజన చర్చలో పలువురు మహిళా రచయితలు.

భేటీ

భేటీ

మహిళా రచయితల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లామాఖాన్‌లో జరిగిన విభజన చర్చలో పలువురు మహిళా రచయితలు పాల్గొన్న దృశ్యం.

రచయితలు

రచయితలు

మహిళా రచయితల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లామాఖాన్‌లో జరిగిన రాష్ట్ర విభజన చర్చలో పలువురు మహిళా రచయితలు పాల్గొన్న దృశ్యం.

ఎపిఎన్జీవో వద్ద భద్రత

ఎపిఎన్జీవో వద్ద భద్రత

హైదరాబాదు పైన అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తాము ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ జాగృతి హెచ్చరించడంతో కార్యాలయం వద్ద పోలీసు భద్రత.

తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

హైదరాబాదులోని ఆబిడ్స్‌ ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలను అడ్డుకుంటున్న దృశ్యం.

అరెస్ట్

అరెస్ట్

హైదరాబాదులోని ఆబిడ్స్‌ ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

అరెస్టు దృశ్యం

అరెస్టు దృశ్యం

హైదరాబాదులోని ఆబిడ్స్‌ ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. డిసిఎంలోకి ఎక్కిస్తున్న దృశ్యం.

సమైక్యవాదులు

సమైక్యవాదులు

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రమే కావాలంటూ ఎపిఎన్జీవో కార్యాలయంలో మాట్లాడుతున్న మహిళా ఉద్యోగులు.

అశోక్ బాబు

అశోక్ బాబు

హైదరాబాదుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఎవరినీ ఎప్పుడు కించపర్చలేదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వివరణ ఇస్తున్న దృశ్యం.

టి: మహిళా రచయితల భేటీ, 'జాగృతి' అరెస్ట్

టి: మహిళా రచయితల భేటీ, 'జాగృతి' అరెస్ట్

టి: మహిళా రచయితల భేటీ, 'జాగృతి' అరెస్ట్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+