తొలిసారి: సచివాలయంలో అడుగు పెట్టిన కోదండరామ్

కేవలం తన వ్యక్తిగత పనులమీదనే ఆయన సచివాలయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం వద్ద తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన కొందరు ఐకేపీ కార్యకర్తలు కోదండరాంతో తమ పరిస్థితిని ఏకరువు పెట్టుకున్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో అల్యూమీనియంతో పల్చటి కాగితాలు తయారు చేసే పరిశ్రమ హిండాల్‌కో మూతపడకుండా చూడాలని కోరుతూ ఆ కంపెనీ కార్మికులను వెంటబెట్టుకొని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసినట్లు కోదండరాం తెలిపారు.
ఇదే క్రమంలో సంబంధిత కంపెనీ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులతో మంత్రి శుక్రవారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారని, సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామని హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications