కిరణ్ దీక్షపై టి మంత్రులకు కోదండ, జైపాల్‌పై సోమిరెడ్డి

 Kodandaram
హైదరాబాద్: తెలంగాణను అడ్డుకోవటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఢిల్లీలో దీక్ష చేయాలనే యోచనలో ఉన్నారని, ఆ కుట్రలన్నింటినీ తెలంగాణ మంత్రులే తిప్పికొట్టాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు.

సిఎం తన అధికారాలను తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని, టి మంత్రులు ఎంతకాలం ఆయన అధికారాన్ని నడవనిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే టి మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీలో స్పీకర్ చేసిన ప్రకటనలో రెండు భాగాలున్నాయని, రాష్ట్ర విభజన బిల్లు, సిఎం నోటీసుపై చేసిన తీర్మానం వేర్వేరు అంశాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎం నోటీసుపై తీర్మాన అంశం రాష్ట్రపతి అడిగింది కాదన్నారు.

దానిని రాష్ట్రపతికి పంపించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సరిపోతుందన్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ పదవికి అపకీర్తి రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉందన్నారు. ఒకవేళ సిఎం నోటీసుపై చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో టి మంత్రులంతా సంఘటితంగా కదలాలని, లేకపోతే వారు బోనులో నిలబడాల్సి వస్తుందన్నారు.

బిల్లును తిరస్కరించే హక్కు శాసనసభ్యులకు ఉందని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా చెప్పారు. బిల్లును తిరస్కరించే హక్కు శాసన సభ్యులకు లేనట్లుగా దిగ్విజయ్ సింగ్, సుశీల్‌ కుమార్ షిండే, అభిషేక్ సింఘ్వీ, జైపాల్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రం ఉద్యమాలతో సర్వనాశనమవుతుంటే ఇంతకాలం నోరు మెదపని జైపాల్‌ ఇప్పుడు గొంతు చించుకోవడమేంటన్నారు.

శాసనసభలో మూజువాణి ఓటుతో చేసిన తీర్మానాలు చెల్లనట్లైతే ఆహార భద్రత, లోక్‌పాల్ బిల్లులు కూడా చెల్లవన్నారు. శాసనసభ, మండలి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయంటూ జైపాల్ ప్రకటించడం వందశాతం సభా ఉల్లంఘనే అన్నారు. ఇందిరాగాంధీపై పోటీ చేశానని గొప్పలు చెప్పుకునే జైపాల్ ఇటలీ సోనియా గాంధీకి దాసోహమంటున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+