ఏ ధైర్యంతో ఈ సినిమా తీశావ్ అన్నా.. కలెక్షన్స్ చూస్తే రక్త కన్నీరే..!
సినిమా సబ్జెక్ట్ ను అర్థం చేసుకోవడం ఎవరివళ్లా కాదు. ఏ సినిమా హిట్టు అవుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అవుతున్నాయి. కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు కోట్లు కొళ్లగొడుతున్నాయి. ఇటీవలికాలంలో పెద్ద హీరోలకు సంబంధించిన చాలా సినిమాల రిజల్ట్ ఇలాగే ఉంది. సినిమాకు యావరేజ్ టాక్ ఓటీటీలో చూడొచ్చులే అని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలనే థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇటీవల ఓ మూవీ ట్రైలర్, టీజర్, పాటలతో సెన్సేషన్ సృష్టించింది. ఆ మూవీనే 'నాగబంధం'.. డివోషనల్ ప్లస్ అడ్వెంచర్ కాన్సెప్ట్ కావడంతో కాస్త టాక్ వచ్చినా సినిమాకు బ్లాక్ బస్టర్ వసూల్లు వస్తాయి.
'నాగబంధం' సినిమాకు కూడా విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ లో ఆ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూసి అంతా ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. ఇక ఫస్ట్ డే కూడా బాగానే వసూల్లు రాబట్టింది 'నాగబంధం' మూవీ.. కానీ ఆ తర్వాత సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ బాగానే ఉన్నా.. స్టోరీ గ్రిప్పింగ్ గా లేకపోవడంతో క్రమంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఫైనల్ రన్ లో లాస్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా పనితనం, హీరో విరాట్ కర్ణ కష్టం స్క్రీన్ పై కనిపిస్తున్నా ఈ మూవీ ప్రేక్షకుడిని అలరించడంలో మాత్రం విఫలం అయిందనే చెప్పాలి. ఆ ప్రభావం కలెక్షన్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది.

'నాగబంధం' మూవీ రిలీజై 8 రోజులు పూర్తయిన సందర్భంగా వసూళ్ల విషయాలు ఓసారి చూస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి 8 రోజుల్లో దాదాపు రూ. 7 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూల్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇక ఏపీ ప్లస్ సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ మూవీకి రూ. 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్, అలాగే రూ. 6 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక కర్ణాటక నుంచి రూ. 2 కోట్ల 30 లక్షలు, నార్త్ నుంచి రూ. 3 కోట్ల 60 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 21 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, అలాగే రూ. 9 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..












Click it and Unblock the Notifications