ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కోడెల భేటీ .. ఇనుమెట్ల ఘటనపై చర్చ
ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు ఈ కేసులో కోడెలను ఏ3గా పేర్కొన్నారు.

కొత్త మలుపులు తిరుగుతున్న ఇనుమెట్ల ఘటన
కోడెలపై దాడి వ్యవహారంలో మొదట ఇనుమెట్లలో నిందితులను అరెస్ట్ చేసి , కొందరు వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు పోలీసులు . అయితే ఈ దాడి వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పోలింగ్ బూత్ లోపలి వెళ్లి తలుపులు పెట్టుకుని పోలింగ్ బూత్ ను తన అధీనంలోకి తెచ్చుకున్నందుకు కోడెలపై కేసు నమోదు చెయ్యాలని వైసీపీ నేత అంబటి డిమాండ్ చేశారు .ఒక వేళ కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార్ దీక్ష చేస్తానని ప్రకటించారు . ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సంఘాన్ని , గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలపై కేసు నమోదు అయ్యింది .

ఇనుమెట్ల ఘటనపై చంద్రబాబుతో స్పీకర్ కోడెల సుదీర్ఘ చర్చ
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన కోడెల ముఖ్యమంత్రితో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఇనుమెట్లలో తనపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.

వైసీపీ దాడిని తిప్పికొట్టే వ్యూహంలో టీడీపీ
ఇనుమెట్లలో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం రావడంతోనే తాను అక్కడకు వెళ్లానని కోడెల తెలిపారు. అయితే తనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిని ఎలా తిప్పికొట్టాలన్న విషయమై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడంపై కూడా చర్చించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications