వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు: కోడలి చేతికి స్పీకర్ కోడెల మనవడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మనవడు గౌతంకు చికిత్స చేయించాలని తల్లిదండ్రులకు హైకోర్టు సూచించింది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉండి తమ బిడ్డ బాగోగులు చూసుకోవాలని సూచించింది. ఈ మేరకు దంపతులకు కౌన్సెలింగ్‌ చేసిన జడ్జి బాబును తల్లి పద్మప్రియకు అప్పగించారు.

తన కుమారుడిని తనకు అప్పగించాలంటూ పద్మప్రియ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గౌతంని కోర్టులో హాజరు పర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం గౌతంను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

kodela's grand son handed over to daughter

శివరామకృష్ణ, పద్మప్రియ, గౌతంలను జడ్జి తన చాంబర్‌లో విచారించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పద్మప్రియ, శివరామకృష్ణలకు కౌన్సెలింగ్‌ చేసి కలిసి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించింది. బాలుడిని అతని తల్లికి అప్పగించింది.

తదుపరి విచారణను అక్టోబర్‌ 10కి వాయిదా వేసినా ధర్మాసనం బాలుడికి అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని స్పష్టం చేసింది. భార్యా, భర్తలు కుమారుడితో కలిసి వైజాగ్‌లో ఉంటూ అధిక బరువు సమస్యతో బాదపడుతున్న గౌతంకు చికిత్స అందించాలని జడ్జి చెప్పారు.

English summary
High Court handed over Andhra Pradesh assembly speaker Kodela Shivaprasad Rao's grand son Ghautham to his daughter - in- law Padmapriya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X