సైకిల్ ర్యాలీలో అపశృతి: బైక్ ఢీ, కోడెలకు స్వల్ప గాయాలు
గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు మద్దతుగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం చేపట్టిన యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన నివాసం నుంచి కోటప్పకొండకు గురువారం ఉదయం కోడెల సైకిల్‌పై బయల్దేరారు.
మార్గమధ్యంలో అనేక చోట్ల నేతలు కార్యకర్తలు కోడెలకు ఘన స్వాగతం పలికారు. ఆయన సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకుంది. యలమంద వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి స్పీకర్ కోడెల్ సైకిల్‌ను ఢీకొట్టాడు.

దీంతో కోడెల శివప్రసాద్ సైకిల్‌పై నుంచి కిందపడ్డారు. పక్కనే ఉన్న నేతలంతా కోడెలను వెంటనే పైకి లేపి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో కోడెల తలకు స్వల్పగాయాలయ్యాయి. కాసేపు సేద తీరిన తర్వాత కోడెల తన సైకిల్ యాత్రను కొనసాగించారు.












Click it and Unblock the Notifications