తిరుమలలో ఆసేవలు రద్దు, వైభవంగా కోయిల్ అల్వార్ తిరుమంజసం !!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో శాస్త్రాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెలిసింది. తిరుమలలో శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని ఈరోజు మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !

ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన అన్నారు.

 Tirumala temple

ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.

ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు రాంభూపాల్ రెడ్డి, మూరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, డిఎల్వో వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, అర్చకులు శ్రీ కిరణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో రద్దీ:
తిరుమలలో భక్తుల రద్దీ కొంచెం తగ్గింది. తిరుమలలో సోమవారం ఉదయం నుంచి రాత్రి ఆలయం మూసేవరకు వరకు 64, 347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తిరుమలలో 28, 358 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని వారి ముక్కులు తీర్చుకున్నారు. సోమవారం తిరుమల శ్రీవారికి హుండి కానుకల రూపంలో రూ. 5 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చాయని మంగళవారం టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో టిక్కెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి 20 గంటల సమయం పడుతున్నదని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో కొద్దిగా భక్తుల రద్దీ తగ్గింది. అయినా భక్తులు మాత్రం వేల సంఖ్యలో తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+