IPL ఫైనల్‌లో కోల్‌కతా గెలిచింది కాబట్టి ఏపీలో ఆ పార్టీదే అధికారం?
ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడయ్యే జూన్ నాలుగోతేదీ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా అద్భుత విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.
2014 ఫైనలే 2024 ఫైనల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కోల్ కతా విజయానికి, ఏపీ ఎన్నికలకు కొందరు ముడిపెడుతూ పోస్టులు చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న ట్వీట్లు, పోస్టులు బాగా వైరలవుతున్నాయి. 2014లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ ను ఒకసారి గుర్తుచేసుకోవాలంటున్నారు. ఆ సంవత్సరంలో జరిగిన ఫైనల్ లో కూడా కోల్ కతా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. అదే సంవత్సరం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది.

కోల్ కతా గెలిచింది.. టీడీపీ గెలిచింది..
కోల్ కతా గెలిచింది.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదే సంఘటన 2024లోను పునరావృతమవుతుందంటున్నారు. బీజేపీ, జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది. కొందరు ట్వీట్లు చేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ అభిమానుల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. జూన్ నాలుగోతేదీన రాబోతున్న ఫలితాల్లో కూటమి విజయం సాధించడం ఖాయమంటున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 2024 ఎన్నికల్లోను బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెబుతున్నారు. ఐపీఎల్ ముగిసినా ఏపీ ఎన్నికల రూపంలో ప్రజల్లో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. చివరకు ఎవరు గెలుస్తారో చూడాలి మరి. క్రికెట్ లో బాగా ఆడిన జట్టు గెలుస్తుంది.. ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ గెలుస్తుందంటున్నారు.












Click it and Unblock the Notifications