జగన్‌కు డేరా బాబా గతే, నవ్వుకుంటున్నారు: కొల్లు తీవ్ర విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడపను ప్రత్యేక రాష్ట్రం చేస్తే తప్ప జగన్ ముఖ్యమంత్రి కావడం కష్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డేరాబాబా గతే జగన్ బాబాకు త్వరలో పట్టబోతోందని చెప్పారు. రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచిందన్నారు.

నంద్యాల ఫలితమే శుక్రవారం కాకినాడలో పునరావృతం కాబోతోందన్నారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్న జగన్.. ముందు పులివెందులలో రాజీనామా చేసి గెలవాలని అన్నారు.
నంద్యాలలో కోట్లు ఖర్చు చేసిందీ.. పోలీసులకు దొరికిందీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. వెనకబడిన తరగతులకు వివాహం కోసం రూ.25వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications