శ్రీధర్‌ను శంకించొద్దు: కోమటిరెడ్డి, ఏం రాజకీయమని జెపి
హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబును శంకించాల్సిన అవసరం ఏమాత్రం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధితోనే శ్రీధర్ రాజీనామా చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత మంత్రులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబును తొలగించడం నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అవమానమన్నారు.

ఓట్ల రాజకీయమొద్దు: జెపి
కులం, మతం, ప్రాంతాల వారీగా ఓట్ల రాజకీయం సరికాదని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. ఇది రాజకీయ నాయకత్వమా లేక రాక్షసత్వమా అని మండిపడ్డారు. ఒక్క అంశంలో కూడా మంత్రివర్గం సమష్టిగా పని చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, పైళ్లపై సంతకాలు చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ లేదని, కేంద్రంలో వాజమ్మ ప్రభుత్వం ఉందన్నారు. మూడు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎపిలో రాజ్యాంగ ఖననం జరుగుతోందని, రాజ్యాంగాన్నే రక్షించలేని వారు ప్రజలను ఏం కాపాడుతారని ప్రశ్నించారు. కొంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
విభజన జరిగినా, జరగకపోయినా అందరం సామరస్యంగా ఉందన్నారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని, తెలుగు ప్రజల భవిష్యత్తును అంధకారంలో పడవేయవద్దని కోరారు. కొడుకుల అధికారం కోసం ప్రజలను ఇబ్బందులు పెడతారా అన్నారు. ఢిల్లీలోని మార్పు ఎపిలో జరగనుందన్నారు.
ఎంపీల దీక్షకు కెవిపి సంఘీభావం
ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు చేపట్టిన దీక్షకు ఎంపీ కెవిపి రామచంద్ర రావు, మంత్రులు టిజి వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications