సిఎం కెసిఆర్ సహకారంతో అభివృద్ధి: కోమటిరెడ్డి, పెద్ద మనసని..

నల్గొండ: వచ్చే నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సహకారంతో అభివృద్దిపై దృష్టి పెడతానని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో నల్గొండ పట్టణాభివృద్ధికి రూ. 270 కోట్లు అడిగిన వెంటనే మంజూరు చేశారని అన్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్‌ఎల్‌బీసీ, ఉదయం సముద్రం ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు నిద్రపోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

 Komatireddy praises CM KCR

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కొత్త లోగో

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కొత్త లోగో కేటాయించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖామంత్రి పద్మారావు కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయాలకు లక్ష్యాలను నిర్దేశించలేదని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో కంటే కొత్త రాష్ట్రం ఏర్పడినంకనే ఎక్సైజ్‌శాఖ ఆదాయం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 66 కల్లు దుకాణాలకు అనుమతులు ఇచ్చామని ఆయన తెలిపారు. అనుమతుల మంజూరీలో నిబంధనలను పాటించామని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకు తమ వంతు ప్రయత్నం తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అలసత్వం సహించను: వైద్యులకు డిప్యూటీ సిఎం రాజయ్య హెచ్చరిక

కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం రాజయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. వైద్యులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

సింగరేణి ఆస్పత్రితో ప్రభుత్వ ఆస్పత్రికి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. అనుసంధానం చేసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వైద్యుల నియామకాలు చేపడుతామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+