మంత్రుల త్యాగంతో టి రాలేదు, కోవర్టులు: కోమటిరెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రాంతం నేతగా మాట్లాడుతుంటే మన మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు కుట్రలకు భయపడి తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటున్నారని, ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు పెదవి విప్పాలన్నారు.
తెలంగాణ మంత్రులు అధికార దాహంతో ఉన్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే వారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కంటే పదవులు ముఖ్యం కాదని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోందని, ఇప్పటికైనా మంత్రులు స్పందించాలన్నారు. మంత్రులు మేల్కోకుంటే ఇప్పుడున్న వారిలో సగం మందిని ప్రజలు దూరం పెడతారన్నారు. కిరణ్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తప్ప ఎవరు మాట్లాడటం లేదన్నారు.
తెలంగాణ ప్రకటన నాలుగు కోట్ల ప్రజల విజయమన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చినా, ప్రక్రియ ఆలస్యమైతే కాంగ్రెసు పార్టీ ఇక్కడ నిలబడలేదన్నారు. తమ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని ఆయన అన్నారు. తాను కోవర్టుల పేర్లను బయటపెడితే వారు నాయకులవుతారన్నారు. అందుకే వారి పేర్లు చెప్పడం లేదన్నారు.












Click it and Unblock the Notifications