లక్షణాల్లేవని జగన్‌పై కొండా, 'కిరణ్ సిఎంగా వస్తారో లేదో'

తనను నమ్ముకున్న వారిలో కొందరికైనా తాను కాంగ్రెసు పార్టీ తరఫున టిక్కెట్లు ఇప్పిస్తానని ఆయన చెప్పారు. డిసెంబర్ 9 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆకాంక్షించారు.
కిరణ్ సిఎంగా వస్తారో లేదో: నారాయణ
ఢిల్లీకి వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే వస్తాడో లేక సాధారణ వ్యక్తిగా వస్తాడో రేపు తేలుతుందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే పంపించిన లేఖ తమకు అందిందన్నారు. ముగ్గురం సభ్యులం మంత్రుల బందాన్ని(జివోఎం)ను కలుస్తామని చెప్పారు.
విభజన తర్వాతనే పార్టీలో రెండు కమిటీలని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాదు రక్షణ పైన తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. సీమాంధ్ర రాజధానిని త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో 45 అసెంబ్లీ, ఐదు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
కేంద్రమంత్రులు జివోఎంను కలవడంపై లగడపాటి
కేంద్రమంత్రులు జివోఎంను కలవడంపై విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పందించారు. జివోఎంను వారు కలవడంలో తప్పు లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సమైక్యంలోనే ఉందని, విభజనలో కాదన్నారు. ఎన్నికల ముందు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడం సాధ్యం కాదని, యూపిఏ ఇప్పటికే మైనార్టీలో ఉందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పదన్నారు.












Click it and Unblock the Notifications