ఏడాది క్రితం మన మాటలు నిజమయ్యాయి-పవన్ నుద్దేశించి నాగబాబు ట్వీట్..!
ఏపీలో గత ఎన్నికల్లో జనసేన విజయంలో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న కొణిదెల నాగబాబు.. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఓ విషయాన్ని ఇవాళ ఎక్స్ లో పంచుకున్నారు. అప్పట్లో తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూ, తనకూ మధ్య జరిగిన ఓ సంభాషణను నాగబాబు ఇవాళ గుర్తుచేసుకున్నారు. అంతే కాదు సోదరుడు పవన్ కూ గుర్తుచేశారు. దీంతో నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది.
సేనాని..సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైందంటూ నాగబాబు ఇవాళ ట్వీట్ చేశారు. మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైందన్నారు. జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైందని, ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైందని, అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైందని నాగబాబు గుర్తుచేసుకుంటున్నారు.

సేనాని..
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2025
సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది, మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైంది, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైంది, అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల… pic.twitter.com/PYwx7CiyEU
అప్పట్లో ఎన్నికలకు ముందు కూటమి దిశగా తన పార్టీతో పాటు టీడీపీ, బీజేపీలను నడిపించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్డీయే విజయానికి బాటలు వేశారు. టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి తన పార్టీని విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 22 సీట్లు మాత్రమే తీసుకున్నా అన్నింట్లోనూ గెలిచి సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ శ్రమ వృథా కాకుండా నాగబాబు కూడా క్షేత్రస్దాయిలో విస్తృతంగా పర్యటించారు. ఇది కూటమి విజయానికి ఎంతో కీలకంగా మారింది. దీంతో అప్పటి రోజుల్ని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఈ ట్వీట్ లో పవన్ , తాను కలిసున్న ఓ ఫొటోనూ కూడా జత చేశారు.












Click it and Unblock the Notifications