Janasena: జనసేన గెలిచే సీట్లెన్నో చెప్పేసిన నాగబాబు-అభ్యర్ధులతో భేటీలో వెల్లడి..!

ఏపీలో 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెల్చుకుని, అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్ధానాల్నీ పోగొట్టుకున్న జనసేన పార్టీ.. ఈసారి ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జనసేన పార్టీ గెలుపు ఆధారంగా కూటమిలో పార్టీల మధ్య ఓట్ల బదలాయింపును లెక్కించాల్సిన పరిస్ధితుల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున ఈసారి పోటీ చేసిన అభ్యర్ధులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించిన నాగబాబు ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు.

ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు 21 సీట్లనూ గెలువబోతున్నట్లు జనసేన నేత నాగబాబు వెల్లడించారు.
అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, ఏ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఎలా నడిచిందనే అంశాలపై అభ్యర్ధులతో నిర్వహించిన వర్చువల్ భేటీలో ఆయన చర్చించారు. ఇందులో జనసేన అభ్యర్ధులంతా వారి అనుభవాలను పంచుకున్నారు.

konidela nagababu reveals janasena winning seats in virtual meet with candidates

పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ పెద్దల మద్దతు ఫలించాయని నాగబాబు వెల్లడించారు. కూటమికే పట్టం కట్టాలని ప్రజలు తీర్పునిచ్చారని ఆయన తెలిపారు. జూన్ 4 తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నరు. జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడుతున్నారన్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పరిస్థితులను బట్టి ఇబ్బందులు ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లారని ప్రశంసించారు.

తామందరికీ వెన్నెముక పవన్ కళ్యాణ్ అని, 17 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరు, ఆయన కష్టం, శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుని ముందుకు వెళ్లారో ప్రత్యక్షంగా చూశామని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ కష్టం వృథా కాకూడదన్న ఉద్దేశంతో అంతా ఐకమత్యంగా పని చేశారన్నారు. ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవన్నారు. ప్రతి చోటా జనసైనికులు ముందుండి ఎన్నికల ప్రక్రియను అద్భుతంగా నడిపించారన్నారు.

టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం యుద్ధం చేయాల్సి వస్తే జనసైనికులు, వీర మహిళలు గట్టిగా నిలబడ్డారని తెలిపారు. వైసీపీ దుష్టపరిపాలన అంతం చేసి, ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మనందరి ఆలోచన ఉండాలని కోరారు. పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే రాష్ట్రం మళ్ళీ భూ బకాసురుల దోపిడీకి బలైపోయే పరిస్థితి వచ్చేదన్నారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతోపాటుగా గ్రామీణ ప్రాంత ప్రజలు జనసేనకి అండగా నిలిచారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోటీ చేసిన ప్రాంతాల్లో జనసేనకు, ఇతర నియోజకవర్గాల్లో కూటమికి బలంగా నిలబడ్డారన్నారు. పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం కూడా కూటమికి కలిసొచ్చే అంశమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+