Nagababu Konidela: మర్చిపోలేని యుద్ధం ఇద్దాం-పొత్తు వేళ జనసైనికులకు నాగబాబు పిలుపు..!
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కలుపుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు చేసేశారు. ఢిల్లీకి చంద్రబాబును వెంటపెట్టుకుని మరీ వెళ్లిన పవన్.. ఊహించినట్లుగానే బీజేపీతో జత చేసేశారు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఎన్డీయే కూటమి రూపంలో ఎన్నికలకు సిద్ధం కావడం ఒకటే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో జనసైనికులకు పార్టీ సీనియర్ నేత నాగబాబు కీలక పిలుపునిచ్చారు.
ఆలోచించాల్సిన సమయం కాదిది, నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయమంటూ ఇవాళ ఎక్స్ లో నాగబాబు ఓ పోస్ట్ పెట్టారు. ఓవైపు ఢిల్లీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరి ఉమ్మడి ప్రకటన కూడా వచ్చేసిన వేళ నాగబాబు ఎక్స్ లో జనసైనికులకు కీలక పిలుపు నిచ్చారు. సందిగ్ధాల సమయం కాదిది, సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం అంటూ నాగబాబు వారికి గుర్తుచేశారు.

ఆలోచించాల్సిన సమయం కాదిది,
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2024
నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం,
సందిగ్ధాల సమయం కాదిది,
సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,
విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం..
శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్,
తీర్చుకోవాల్సిన పగా… pic.twitter.com/jMipvgnVMT
విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయమంటూ నాగబాబు తెలిపారు. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్, తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్..అంటూ వారికి గుర్తుచేశారు.నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు, నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు... సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం....✊✊ అంటూ నాగబాబు క్యాడర్ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications