వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలోని సీమాంధ్రుల్లో కొంత ఆందోళన: కొత్తపల్లి గీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kothapalli Geetha in Lok Sabha
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని సీమాంద్రులు వివక్షకు గురవుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గురువారం ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టు కొనసాగాలని ఆమె కోరారు. పూర్వాపరాలు ఆలోచించకుండా రాష్ట్ర విభజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా త్వరితగతిన విభజన జరిగిందని, తెలంగాణలోని సీమాంద్రుల్లో కొంత ఆందోళన ఉందన్నారు. ఆ ఆందోళన ఇంకా పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి కొన్ని నెలలు గడిచినా ఉద్యోగుల విభజన పూర్తికాలేదన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

లోకసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత రైల్వే భద్రతా, బొగ్గుగనుల కేటాయింపులు, సేతు సముద్రం ప్రాజెక్టు, తాగునీరు లాంటి అంశాలపై పలువురు సభ్యులు ప్రశ్నించారు. వాటికి సంబంధించిన మంత్రులు సమాధానాలు చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయంపై రాజ్యసభలో రగడ

శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టడంపై కాంగ్రెస్‌ సభ్యులు గురువారం రాజ్యసభలో తీవ్ర నిరసన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాశ్రయం పేరు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినిపించుకోలేదు.

శంషాబాద్‌ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరును ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ్యుడు వీ హనుమంత రావు మాట్లాడే ప్రయత్నం చేయగా డిప్యూటీ ఛైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

English summary
YSR Congress Party MP Kothapalli Geetha in Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X