Kovur Assembly Election 2024 Results LIVE: నల్లపరెడ్డి vs వేమిరెడ్డి: టగ్ ఆఫ్ వార్..
కోవూరు అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య హోరాహోరి పోరు నెలకొంది.
ఈ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూసే నియోజకవర్గాల్లో ఒకటి- నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భవించిన తరువాత ఏడుసార్లు గెలిచిందిక్కడ. నల్లపరెడ్డి కుటుంబానికి పెట్టని కోట. గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇప్పుడు ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ రెడ్డి గెలుస్తూ వస్తోన్నారు.

2004లో నల్లపరెడ్డి కుటుంబం జైత్రయాత్రకు తొలిసారిగా బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఘన విజయం సాధించారు. 2009 నుంచి మళ్లీ నల్లపరెడ్డి హవా మొదలైంది. ఆ ఎన్నికలో ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2012 ఉప ఎన్నికలో 22 వేలకు పైగా ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. పార్టీ ఏదైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 2014లో మాత్రం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలో టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 7,937 ఓట్ల తేడాతో నల్లపరెడ్డి ఓడిపోయారు.
కోవూరులో మొత్తంగా 1,93,941 ఓట్లు పోల్ కాగా.. పోలంరెడ్డికి 94,108, నల్లపరెడ్డికి 86,171 ఓట్లు పడ్డాయి. 4.09 శాతం తేడాతో ప్రసన్నకుమార్ రెడ్డి పరాజయం పాలయ్యారు. 2019 నాటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 39,891 ఓట్ల మెజారిటీతో టీడీపీకి చెందిన పోలంరెడ్డిని మట్టికరిపించారు.
ఈ దఫా కూడా మళ్లీ ప్రసన్నకుమార్ రెడ్డే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఆయనపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నిలబెట్టింది టీడీపీ. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు కూడా వేమిరెడ్డి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు. టికెట్ల పంపిణీలో తేడా రావడంతో ఆయన పార్టీని వీడారు. టీడీపీలో చేరారు.
కిందటి నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో కోవూరులో 79.29 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. విడవలూరు, కడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండటం తమకు కలిసివస్తుందని, పైగా అత్యధిక శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్లస్ పాయింట్‌గా భావిస్తోంది వైసీపీ.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications