ఆ జిల్లాపై ఎటూతేల్చుకోలేని చంద్రబాబు..! ఇరుకునపెట్టేసిన నేతలు..?

ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో జిల్లాల పునర్ విభజన జరిగింది. అప్పట్లో ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామన్న హామీని నిలబెట్టుకునే క్రమంలో జగన్ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో హేతుబద్దత కొరవడటంతో కూటమి పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తమకు అధికారం ఇస్తే జిల్లాల లెక్కల్ని సరిచేస్తామంటూ గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మరోసారి కసరత్తు చేసి చివరికి మూడు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఇందులో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలున్నాయి. వీటితో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతకు మించి జిల్లాల్ని ముట్టుకుంటే తేనెతుట్టె కదిపినట్లవుతుందని, కొత్త తలనొప్పులు తప్పవని వచ్చిన అంచనాల మేరకు సీఎం చంద్రబాబు పునర్విభజనను వీటికే పరిమితం చేసేశారు. అయితే జిల్లాల పునర్ విభజన డిమాండ్లలో వచ్చిన ఉమ్మడి కృష్ణాజిల్లా మార్పులపై మాత్రం ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది.

Krishna district reorganisation pits Chandrababu against mixed opinions within TDP

ఉమ్మడి కృష్ణాజిల్లాలో భాగమైన నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్ని ప్రస్తుత కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లాల నుంచి వేరు చేసి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజాప్రతినిధులైన మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పట్టుబట్టారు. అదే సమయంలో వీటి కంటే విజయవాడకు చాలా దగ్గరగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దంటూ ఇక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పట్టుబట్టారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)లో కలపాల్సిందేనంటున్నారు. దీంతో చిక్కుముడి పడింది.

Krishna district reorganisation pits Chandrababu against mixed opinions within TDP

విజయవాడకు పొరుగున ఉన్న పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నా, దానికి వ్యతిరేకంగా కలపొద్దంటూ స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పట్టుబట్టడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడుల్ని మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎలా అడుగుతారని చంద్రబాబు మంత్రుల కమిటీనే ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని కేబినెట్‌ సబ్‌ కమిటీకి చంద్రబాబు చెప్పేశారు. అలాగే నేతల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాబీష్టానికి అనుగుణంగా నేతల వ్యవహారశైలి లేదన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం, పెనమలూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు యథాతథంగానే కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+