కృపామణి ఆత్మహత్య: సాయి శ్రీనివాస్‌పై లుకౌట్ నోటీసులు జారీ
ఏలూరు: ఓ రౌడీ షీటర్ అఘాయిత్యాలతో ఆత్మహత్యకు పాల్పడిన కృపామణి కేసులో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు పారిపోయేందుకు కుట్ర పన్నాడనే మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సాయి శ్రీనవాస్ కోసం లుకౌట్ నోటీసునే జారీ చేసినట్లు తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి అనే గృహిణిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడే వ్యభిచార రొంపిలోకి దింపగా, ఆమెను గుడాల సాయి శ్రీనివాస్ అనే రౌడీ షీటర్ రూ.7 లక్షలకు కొనుగోలు చేసి కొన్ని నెలల పాటు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే.

దాంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు సూసైడ్ నోట్ రాయడమే కాక, తన ఆవేదనను సెల్పీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించడంతో పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు.
పోలీసులు కృపామణి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్టు చేశారు. అలాగే రౌడీషీటర్ ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని, ఈ రౌడీ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ తాజాగా విదేశాలకు చెక్కేసేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.












Click it and Unblock the Notifications