ఉజ్వలం:అమెరికా స్వాతంత్ర్యవేడుకల్లో కెటిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: అన్నిరకాల పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆర్ అండ్ డి, సాఫ్ట్‌వేర్ రంగాల్లో దేశంలోనే అత్యున్నత స్థాయిలో ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. దేశంలో సాఫ్ట్‌వేర్ రంగంలో హైదరాబాద్ రెండో అతిపెద్ద నగరమని చెప్పారు.

నగరంలోని మాదాపూర్‌లోని ఆవాసా హోటల్‌లో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 238వ అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమెరికా, భారత్‌ల స్నేహ సంబంధాల వల్ల భారత్ తోపాటు తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందని అన్నారు.

దేశంలోని మొత్తం ఐటి ఉత్పత్తుల్లో 74శాతం అమెరికాకు, 17 శాతం యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కెటిఆర్ చెప్పారు. ఉన్నత చదువులు చదివిన తెలంగాణ యువత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో హైదరాబాద్ నిపుణులు సేవలందిస్తున్నారని.. అందుకు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యా నాదెళ్ల నిదర్శనమని చెప్పారు.

భారత్, అమెరికా దేశాల మధ్య సన్నిహిత సంబంధం వల్ల ఆర్థికంగా రెండు దేశాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ మైకేల్ సి ములిన్స్ అన్నారు. ఈ వేడుకల్లో ఐఏసిసి ఛైర్మన్ రవి విష్ణు, మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్‌సి రాజు, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని ఆవాసా హోటల్‌లో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 238వ అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అన్నిరకాల పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా, భారత్‌ల స్నేహ సంబంధాల వల్ల భారత్ తోపాటు తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందని అన్నారు.

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

దేశంలోని మొత్తం ఐటి ఉత్పత్తుల్లో 74శాతం అమెరికాకు, 17 శాతం యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కెటిఆర్ చెప్పారు.

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

అమెరికా స్వాతంత్ర్య వేడుకలు

ఈ వేడుకల్లో ఐఏసిసి ఛైర్మన్ రవి విష్ణు, మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్‌సి రాజు, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+