బాబు మెడలు వంచి కోర్టుకు ఈడ్చి ఐనా సరే, లేఖ రాయం: కేటీఆర్
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడలు వంచి, బాబును కోర్టుకు ఈడ్చి తాము కరెంటును తెచ్చుకుంటాని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు కరీంనగర్ జిల్లాలో అన్నారు.
శనివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆఱ్ ఉత్తరం రాస్తే కరెంటు ఇస్తాడని చెప్పడం కాదని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కరెంటులో తెలంగాణకు53.86 శాతం వాటాను ఇవ్వాల్సి ఉందన్నారు.

అది తెలియకుండా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడడం అవివేకామన్నారు. చంద్రబాబుకు ఉత్తరం రాసేది లేదని చెప్పారు. ఇవ్వకపోతే బరాబర్ గల్లా పట్టి అడిగి తీసుకునే హక్కు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణను ఆశించి సాధించుకోలేదని, శాసించి సాధించుకున్నామన్నారు. అలాగే కరెంటును కూడా న్యాయపోరాటం చేసి సాధించుకుంటామన్నారు.
చంద్రబాబు పెరిగింది హెరిటేజ్ పాలతో కాదని, తెలంగాణ తల్లి రొమ్ము పాలతోనే ఆయన పెరిగారన్నారు. ఆంధ్రుల మోచేతి నీళ్లు తాగడాన్ని తెలంగాణ నేతలు మానుకోవాలన్నారు. తెలంగాణ వచ్చినా ఆంధ్రా పార్టీలే కావాలా అని ఆయన ప్రశ్నించారు. బిత్తరి మాటలు మాట్లడే కాంగ్రెస్ నాయకుల వల్లే దరిద్రం పట్టుకుందని ధ్వజమెత్తారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications