వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినేష్ వ్యాఖ్యలు: కిరణ్ చరిత్ర తెల్సిందని కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కిరణ్ ఆస్తుల పైన దర్యాఫ్తు జరిపిస్తామని హెచ్చరించారు. దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కెటిఆర్ స్పందించారు.

కిరణ్ అక్రమాస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని తాము మొదటి నుండి చెబుతున్నామని ఇప్పుడు దినేష్ రెడ్డి ఆరోపణలతో నిజమని తేలిందన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు అనర్హుడన్నారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జా వ్యవహారాలు బయటపెట్టినందుకు కిరణ్ మీడియా గొంతు నొక్కారని ఆరోపించారు.

కిరణ్ సీమాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ అని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారన్నారు. కిరణ్ ఆపద్దర్మ ముఖ్యమంత్రి మాత్రమే అన్నారు. దినేష్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు సంతోషమన్నారు. కిరణ్‌కు వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కిరణ్ నాటకాలు రానున్న తెలంగాణ ప్రభుత్వం బయటపెడుతుందన్నారు.

ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భాగస్వాములు కావొద్దన్నారు. దినేష్ రెడ్డి వాస్తవాలు బయటపెట్టడంతో కిరణ్ చరిత్ర ఏమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంపై సిఎం కార్యాలయం కుట్రలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఎపిఎన్జీవోల సభ అనుమతిపై కిరణ్ ఒత్తిడి తెచ్చారనేది బహిర్గతమైందన్నారు. కిరణ్ ప్రోద్బలంతోనే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందని స్పష్టమైందని విమర్శించారు.

English summary
Telangana Rastra Samithi MLA KT Rama Rao on Tuesday fired at CM Kiran Kumar Reddy after DGP Dinesh Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X