వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీ ఆరంభం..సర్వ‌త్రా ఆస‌క్తి : టిడిపి క్యాంప్ లో స్పెష‌ల్ ఫోక‌స్‌..!

|
Google Oneindia TeluguNews

కొద్ది గంటలుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న కెటిఆర్ - జ‌గ‌న్ భేటీ ప్రారంభ‌మైంది. కేసీఆర్ సూచించిన విధం గా టిఆర్‌య‌స్ బృందంతో కెటిఆర్..జ‌గ‌న్ నివాసానికి చేరుకున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌ల కోసం జ‌గ‌న్ తో భేటీ అవుతున్న‌ట్లుగా కెటిఆర్ ప్ర‌క‌టించారు. లంచ్ మీటింగ్ లో జాతీయ - ఏపి రాజ‌కీయాల పై చ‌ర్చించ‌నున్నారు. ఆ త‌రు వాత జ‌గ‌న్ -కెటిఆర్ మ‌ధ్య ఒన్ టు ఒన్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత ఈ స‌మావేశం పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు..

ఆసక్తి క‌ర మీటింగ్ ఆరంభం.. ఇరు పార్టీల నేత‌లు హాజ‌రు

ఆసక్తి క‌ర మీటింగ్ ఆరంభం.. ఇరు పార్టీల నేత‌లు హాజ‌రు

వైసిపి అధినేత జ‌గ‌న్ తో టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. టిఆర్‌య‌స్ నుండి ఎంపీలు వినోద్‌, సంతోష్ ల‌తో పాటుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్ ..వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నా రు. వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ నేతలకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై స‌మావేశం జ‌రుగుతుంద‌ని ఇరు పార్టీల నేత లు చెబుతున్నారు. జ‌గ‌న్ స్పంద‌న ఏంట‌నేది కీల‌కంగా మారింది. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు వి విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

లంచ్ మీటింగ్‌..త‌రువాత ఏకాంత భేటీ...

లంచ్ మీటింగ్‌..త‌రువాత ఏకాంత భేటీ...

టిఆర్‌య‌స్ నేత‌ల‌ను జ‌గ‌న్ లంచ్ కు ఆహ్వానించారు. ఈ లంచ్ స‌మావేశంలో జ‌గ‌న్ పాద‌యాత్ర విశేషాల‌ను టిఆర్ య‌స్ నేత‌లు అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచినందుకు కెటిఆర్‌కు జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. ఆ త‌రువాత కేసీఆర్ ప్ర‌తిపాదిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను కెటిఆర్ ఈ సమా వేశంలో జ‌గ‌న్ కు వివ‌రించారు. కెసిఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం జ‌గ‌న్ కు పంపిన సందేశాన్ని కెటిఆర్ వివ‌రిస్తున్నారు. ఏపి -తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం ఏపి నుండి వైసిపి ఫ్రంట్ కోసం క‌లిసి రావాల‌ని కేసీఆర్ సందేశాన్ని జ‌గ‌న్ కు అందించారు. రెండు పార్టీల నేత‌ల స‌మావేశం త‌రువాత కెటిఆర్ - జ‌గ‌న్ ఒన్ టు ఒన్ స‌మావేశం కానున్నారు. ఇంద లో ఏపి రాజ‌కీయాల పై ప్ర‌త్య‌కంగా ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఏపిలో చంద్ర‌బాబు ను ఓడించేందుకు తాము ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని గ‌తంలోనే కేటీఆర్‌..అస‌ద్ లు చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు వారి వ్యూహాల పై జ‌గ‌న్ తో షేర్ చేసుకొనే అవ‌కాశం ఉంది.

ప్ర‌త్యేక హోదా ..టిడిపి క్యాంప్ లో స్పెష‌ల్ ఫోక‌స్‌..

ప్ర‌త్యేక హోదా ..టిడిపి క్యాంప్ లో స్పెష‌ల్ ఫోక‌స్‌..

ఈ స‌మావేశంలో జ‌గ‌న్ త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఫెడ‌ర‌ల్ ప్రంట్ తో క‌లిసి రావ‌టానికి త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని అయితే, ఏపికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వారికి మ‌ద్ద‌తిస్తాన‌ని తాను ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌టంతో..అదే త‌న విధాన మ‌ని జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఇదే స‌మయంలో ఎంఐఎం అధినేత అస‌ద్ సైతం ట్వీట్ చేసారు. కేసీఆర్ అమ‌లు చేసిన రైతు బంధు స్కీం పై ఇప్పుడు జాతీయ స్థాయిలో అమ‌లు కోసం దృష్టి పెట్టార‌ని ఆయ‌న త‌న ట్వీట్ లో వివ‌రించారు. ఇక‌, జ‌గ‌న్ - కేటీఆర్ భేటీ పై ఏపి నిఘా వ‌ర్గాలు దృష్టి సారించాయి. జ‌గ‌న్ నివాసం వద్ద ఎప్ప‌టి క‌ప్పుడు స‌మాచారం సేక‌రించి అమరావ‌తి చేర‌వేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టిడిపి క్యాంపు ఈ స‌మావేశం పై స్పెష ల్ ఫోక‌స్ పెట్టారు. స‌మావేశం పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టిన టిడిపి..ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ వైఖ‌రి ఎలా ఉంటుంద‌నే అంశం పై ఆరా తీస్తున్నారు.

English summary
KTR-Jagan meeting started in Lotus pond. They discussing on Federal Front issue in lunch meeting. Jagan stated that who supports for Ap special status then YCP support that alliane. Now this meeting vreatinig political heat in both telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X