అంకెల గారడీ, మభ్యపెట్టారు: కిరణ్ రెడ్డిపై కెటిఆర్

ఇక్కడే పుట్టి పెరిగానని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారని గుర్తు చేస్తూ రాజకీయాల్లోకి రాక ముందు కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూర్‌లో రెస్టారెంట్ నడుపుకోలేదా, కిరణ్ రెడ్డి సోదరుడు బెంగళూర్‌లో నివాసం ఉండడం లేదా అని కెటిఆర్ అడిగారు. తెలంగాణ అభివృద్ధిపై ముఖ్యమంత్రివన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు.
హైదరాబాదులో మతకల్లోలాలు ఎందుకు జరిగియే తెలియదా అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రులను మార్చడానికే మతఘర్షణలను రెచ్చగొట్టారని ఆయన విమర్సించారు. రాష్ట్ర విభజన వల్ల నక్సలిజం సమస్య తలెత్తదని మాజీ డిజిపి దినేష్ రెడ్డి చెప్పిన మాటలను కావాలని ఉద్దేశ్యపూర్వకంగా కిరణ్ కుమార్ రెడ్డి మరిచిపోయారని ఆయన అన్నారు. కర్నూలు ఆస్పత్రికి వెళ్లిన తెలంగాణ గర్భిణీ స్త్రీకి ప్రసవం చేయకుండా వెనక్కి పంపిన ఉదంతం కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా అని ఆయన అడిగారు.
బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యయనం చేసి మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు. ఇది ఇందిరా గాంధీ కాలమనే పద్ధతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, తాను సోనియా గాంధీ కాలంలో ఉన్నాననే విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోయారని, తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన హామీలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications