వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు ఏం చేశారంటే : దూరం పెరగటం వెనుక..!!

|
Google Oneindia TeluguNews

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన రోజు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మంత్రిగా కేటీఆర్ తో సహా మంత్రివర్గం కొలువు తీరిన రోజు. తిరిగి 2018లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎనిమిదేళ్ల కాలంలో మంత్రిగా ... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొత్త రాష్ట్రం పైన ప్రత్యేక ముద్ర వేసారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలతో తమ సంబంధాల పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రితో చంద్రబాబుతో ఏర్పడిన గ్యాప్ కు కారణాలను విశ్లేషించారు.

జగన్ తనకు పెద్దన్న లాంటి వారంటూ

జగన్ తనకు పెద్దన్న లాంటి వారంటూ

ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరైన కేసీఆర్ పలు సందర్భాల్లో అమరావతికి వచ్చారు. జగన్ సైతం ప్రగతి భవన్ లో కేసీఆర్ కలిసి ఉమ్మడి రాష్ట్రాల అంశాల పైన సమావేశాలకు హాజరయ్యారు. ఇక, ఇప్పుడు మంత్రి కేటీఆర్ తనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న సంబంధాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ తనకు పెద్దన్న లాంటి వారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సైతం ఆయనను ఆప్యాయంగా చూస్తారని చెప్పారు.

చంద్రబాబుతో వివాదాలపైనా..

చంద్రబాబుతో వివాదాలపైనా..

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ తాము ఏ రోజు వివాదాలు పెట్టుకోలేదని కేటీఆర్ స్పష్టం చేసారు. అయితే, రాజకీయ లబ్ది కోసం తమ ప్రత్యర్ధి పార్టీతో చేతులు కలపటం వలన దూరం పెరిగిందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరూ శత్రువులుండరని..ప్రత్యర్ధులే ఉంటారని వ్యాఖ్యానించారు. ఏపీతో తమకు మంచి సత్సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో రోడ్లు - మంచి నీరు - విద్యుత్ పరిస్థితుల పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆ తరువాత కేటీఆర్ తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. తన స్నేహితులు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నానంటూ ఆ వివాదానికి ముగింపు పలికారు.

జగన్ కు కేసీఆర్ ఆప్యాయంగా చూస్తారు

జగన్ కు కేసీఆర్ ఆప్యాయంగా చూస్తారు


ఇక, తాజాగా దావోస్ పర్యటనలతో సైతం ఏపీ సీఎం జగన్ - కేటీఆర్ కలుసుకున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..జగన్ తో తనది సోదర బంధంగా పేర్కొన్నారు. జగన్ సైతం తాను అధికారంలోకి వచ్చిన సమయం నుంచి పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనంటూ తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణ - అటు ఏపీలోనూ రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమయ్యాయి.

English summary
Telangana Minister KTR interesting Comments on AP CM JAgan and ex CM Chandra Babu, He stated having good relations with AP state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X