టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్-అందుకే రాజీనామా, విపక్షాల పొత్తుతో..!
కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయుష్మాన్ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి విపక్ష టీడీపీలో చేరిపోయారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన సంజీవ్ కుమార్.. ఆయనతో కీలక చర్చలు జరిపారు. కర్నూలు ఎంపీ టికెట్ పై ఆయనకు ఇందులో హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించారు.కర్నూలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎంపీగా అయ్యానని, కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు తప్ప ఇంకేమీ చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పదవులు ఇచ్చినా గాని వారి చేతిలో అధికారం మాత్రం ఉండదన్నారు. పదవి ఉన్నా ఉత్సవ విగ్రహంగా ఉండడం అనేది తనకు నచ్చలేదన్నారు.

విశ్వ ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోలేకపోయానని సంజీవ్ కుమార్ తెలిపారు. మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి మంచి చిహ్నమన్నారు. కర్నూల్ లో ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సంజీవ్ పేర్కొన్నారు. .కర్నూలు ప్రాంతంలో వలసలు ఆపాలని, యువతకు ఉపాధి కల్పించాలని, రైతులను ఆదుకోవాలనేది తన లక్ష్యమన్నారు.ఎలాంటి షరతులు లేకుండానే తాను టీడీపీ లో చేరినట్లు సంజీవ్ కుమార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications