నరికేస్తానంటావా, మీ స్థాయికి సరిపోకుంటే, ఆరోగ్యం పణంగా పెట్టా: బాబుపై కేవీపీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మరో లేఖాస్త్రం సంధించారు.

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మరో లేఖాస్త్రం సంధించారు. నా సవాల్ స్వీకరించాలని లేదంటే మీరు చెప్పేవి అని ప్రజలు అర్థం చేసుకుంటారని మండిపడ్డారు.

పోలవరంపై నా కుట్రలు అబద్దం

పోలవరంపై నా కుట్రలు అబద్దం

పోలవరం ప్రాజెక్టు పైన కేవీపీ మరో లేఖ రాశారు. తాను పోలవరం ప్రాజెక్టును ఆపడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పడం సరికాదన్నారు. అవి అబద్దాలు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకున్నానన్న ఆరోపణల పైన కమిటీ వేయాలన్నారు. దీని పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నరికేస్తానని సవాల్ చేస్తారా

నరికేస్తానని సవాల్ చేస్తారా

పోలవరం ప్రాజెక్టు పైన తాను వాస్తవాలను వెలుగులోకి తెస్తే నరికేస్తా, పాతేస్తా, జైల్లో పెడతానని హెచ్చరింపులు, బెదిరింపులు, సవాళ్లా అని ధ్వజమెత్తారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసే వ్యవహారం సరికాదన్నారు.

బంగారక్క లాంటి తోలు బొమ్మలతో..

బంగారక్క లాంటి తోలు బొమ్మలతో..

పోలవరం ప్రాజెక్టు పైన వాస్తవాలతే లేఖ రాస్తే కేతిగాడు, బంగారక్క లాంటి తోలు బొమ్మలను మీడియా ముందు ఆడించారని మండిపడ్డారు.

మీ స్థాయికి నేను సరిపోననుకుంటే..

మీ స్థాయికి నేను సరిపోననుకుంటే..

పోలవరం ప్రాజెక్టు పైన తాను రాసిన లేఖలకు సమాధానం చెప్పాలన్నారు. తాను విజయవాడ సహా ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మీ స్థాయికి (చంద్రబాబు) నేను సరిపోనని అనుకుంటే కనీసం మంత్రిని అయినా ముఖ్యమంత్రి పంపించాలన్నారు. విజయవాడలో ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు.

జలయజ్ఞంపై..

జలయజ్ఞంపై..

కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞం పైన ఆరోపణలు వస్తే 31 ప్రాజెక్టుల వద్ద విచారణ జరిపించామని చెప్పారు.

విభజన సమయంలో..

విభజన సమయంలో..

విభజన సమయంలో ఏపీ పైన బీజేపీ చూపిన కపట ప్రేమ ఇప్పుడు మీ మాటలతో (చంద్రబాబు) రుజువు అవుతోందని మండిపడ్డారు.

నేను ఆరోగ్యాన్ని, రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టా..

నేను ఆరోగ్యాన్ని, రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టా..

రాష్ట్రం విడిపోకుండా ఉండాలని తాను తన ఆరోగ్యాన్ని, రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి పోరాడానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టానని చెప్పారు. తన సవలును చంద్రబాబు స్వీకరించకుంటే నేను చెప్పినవి వాస్తవాలు అని, మీ అనుచరులు చెప్పేవి అబద్దమని ప్రజలు తెలుసుకుంటారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+