బడ్జెట్ ఎఫెక్ట్: రాజ్యసభలో కేవీపీ నిరసన, ప్లకార్డుల ప్రదర్శన
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. హామీలు విస్మరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కేవీపీ ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి సాధారణ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ పదేపదే ఆయనను కూర్చోమని చెప్పాల్సి వచ్చింది. కేవీపీ తీరుపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెల్ నుంచి వెళ్లిపోవాలని పదేపదే చెప్పారు. విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు వేరుగా మాట్లాడుతూ.. విశాఖపట్నంకు రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం తమకు లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications