కేవీపీ ఆపరేషన్ వైసీపీ - టచ్ లో కీలక నేతలు, లిస్టులో..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమితో ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ నుంచి కొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ఎన్నికల్లో ఓడినా 11 సీట్లకే పరిమితం కావటం పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఈ సమయంలో ఏపీలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కాంగ్రెస్ కొత్త వ్యూహం
రాష్ట్ర విభజన తరవాత ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీని ప్రజలు తాజా ఎన్నికల్లో తిరస్కరించటంతో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు..ఓటర్లు జగన్ పార్టీ వైపు మళ్లారు. ఇప్పుడు వైసీపీ ఓడటం..మూడు పార్టీల కూటమి అధికారంలో ఉండటంతో తిరిగి పార్టీ బలోపేతానకి ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగానే గతంలో కాంగ్రెస్ లో పని చేసి...తరువాత వైసీపీలోకి వెళ్లిన ముఖ్యులతో మంత్రాంగం కోసం కేవీపీని రంగంలోకి దించింది.

KVP Rama Chandra Rao made interesting comments over Congress Future in AP

కేవీపీ వ్యాఖ్యలతో
వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేవీపీ ఇప్పుడు మంత్రాంగం ప్రారంభించారు. వైఎస్సార్ జన్మదినం వేళ ఇక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఏపీలో సహజంగా అధికారం దక్కటం కష్టమైనా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తామని స్పష్టం కేవీపీ చెప్పుకొచ్చారు. రెండు ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా తమ వైఖరి ఉంటుందని వెల్లడించారు. వైసీపీలో మాజీ మంత్రులు, సీనియర్లు టచ్ లోకి వస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

మొదలైన మంత్రాంగం
తమ పార్టీలోకి చేరికల పైన మంత్రాంగం ఇప్పుడే మొదలైందని కేవీపీ చెప్పుకొచ్చారు. చాలా మంది రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయటం మంచిదనే అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషించారు. త్వరలోనే రాజకీయంగా కీలక పరిణామలు చోటు చేసుకుంటాయని వివరించారు. అటు షర్మిల వైఎస్సార్ కు రాజకీయంగా వారసురాలని రాహుల్ చెప్పటం ద్వారా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో,..రానున్న రోజుల్లో వైసీపీ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ...జగన్ ఏ విధంగా తిప్పి కొడతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+